Rajamouli : రాజమౌళి గురించి డైరెక్టర్ చందు మొండేటి హాట్ కామెంట్స్

Rajamouli : రాజమౌళి గురించి డైరెక్టర్ చందు మొండేటి హాట్ కామెంట్స్

చందు మొండేటి.. తెలుగులో చాలామందికి నచ్చే యువ దర్శకుడు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ కు, సినిమాలు కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

రాజమౌళి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిఖిల్ కార్తికేయ టీజర్ ని రిలీజైనప్పుడు రాజమౌళి గారు ఆ టీజర్ లైక్ చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారనీ.. ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ నాకు ఆ విషయం తెలియలేదు అంటూ వివరించాడు చందు మొండేటి. ఆ తర్వాత నేను చూసా అయితే దాన్ని నేను సినిమా విజయం కంటే చాలా ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యా.. రాజమౌళి మా సినిమా గురించి ఒక ట్వీట్ చేసినప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు మంచి హైప్‌ వచ్చింది. టీజర్, ట్రైలర్ మెచ్చుకుంటూ సినిమా విడుదలకు ముందే ఆయన నాకు ఒక లెటర్ రాశారు.

"ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు టీజర్ చాలా బాగా నచ్చింది" అంటూ ఆయన లేఖ రాశారని.. ఆ లేఖను ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నట్లు వివరించాడు చందు మొండేటి. సినిమా రిలీజ్ కంటే ముందే రాజమౌళిని ఇంప్రెస్ చేయడం నాకు చాలా పెద్ద గౌరవంగా అనిపించిందని.. అది కూడా నా ఫస్ట్ సినిమాకి అంతకంటే పెద్ద సంతోషం లేదంటూ వివరించాడు చందు. అందుకే అంటారు.. రాజమౌళి అంటే ఎందరికో ఇన్‌స్పిరేషన్ అని.

Tags

Read MoreRead Less
Next Story