Director Shankar : సందడిగా డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి
సౌత్, నార్త్ ఇండియాలోని సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల సమక్షంలో ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో ఏప్రిల్ 15న సోమవారం ఉదయం ఐశ్వర్య పెళ్లిని ఘనంగా జరిపారు శంకర్. చెన్నైలో ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు, సినీ ప్రముఖులు సందడి చేశారు. కమల్‌హాసన్, రజనీకాంత్, నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు, సూర్య, కార్తి, నరేశ్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
శంకర్ ఇంట్లో పెళ్లి వేడుకకు సంంబధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. డాక్టర్ అయిన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం.
2021లో క్రికెటర్ రోహిత్‌తో ఆమె వివాహం జరిగింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రోహిత్‌పై వచ్చిన పలు ఆరోపణల కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగింది.
తరుణ్ కార్తీక్.. శంకర్ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2' జూన్‌లో విడుదల కానుంది. రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్' సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. చెన్నైలో జరిగిన ఈ పెళ్లివేడుకకు ఆయన అప్ కమింగ్ సినిమాల తారాగణం అంతా విచ్చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com