Director Shankar : అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ పెద్ద కూతురు రెండో పెళ్లి

డైరెక్టర్ శంకర్ (Director Shankar) పెద్ద కూతురు ఐశ్వర్య (Aishwarya) రెండో పెళ్లికి సిద్దమైంది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ (Tarun Karthik) తో ఆమె నిశ్చితార్థం చెన్నైలో ఆదివారం జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. వేడుకకు సంబంధిత ఫొటోలను ఐశ్వర్య సోదరి, నటి అదితి శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్ రోహిత్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ . ఇప్పుడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైంది. తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు.పాటల రచయిత
డైరెక్టర్ శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్యా శంకర్ డాక్టర్ గా కొనసాగుతుంటే, రెండో కూతురు ఐశ్వర్య మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తోంది అదితీ శంకర్.
డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ -2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని కూడా శంకర్ తెరకెక్కిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com