Vishwambara : మెగాస్టార్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన డైరెక్టర్

Vishwambara : మెగాస్టార్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన డైరెక్టర్

చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సాంగ్‌కు ‘నా సామిరంగ’ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేశారు. ‘నా కల నెరవేరింది. విశ్వంభరలోని ఓ బ్యూటిఫుల్ సాంగ్‌కు నేను మెగాస్టార్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేశాను’ అని బన్నీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా, జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

త్రిష డ్యూయల్ రోల్

ఈ సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ చేస్తుందనేది తెలుస్తుంది. ఈ సినిమాలో 'త్రిష' భూలోకానికి చెందిన సాధారణమైన కన్యగాను, దేవలోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రలలోను త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. చిరంజీవి - త్రిష .. ఈ ఇద్దరి పాత్రలు ఇటు క్లాస్ గాను .. అటు మాస్ గాను కనిపిస్తాయని చెబుతున్నారు. చిరంజీవికి చెల్లెళ్లుగా .. ఇతర దేవకన్యలుగా మరికొందరు హీరోయిన్స్ తెరపై కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story