Director : విజయేంద్రప్రసాద్ చెత్త డైరెక్టర్.. అలా చెప్పిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా రాత మార్చిన రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఒకరు. ఐతే.. ఆయన మాత్రం డైరెక్టర్ గా అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా ఈయన మొదట రాఘవేంద్రరావు (Raghavendra Rao) డైరెక్షన్ లో వచ్చిన జానకి రాముడు లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి కథను అందించాడు. ఇక ఆ తర్వాత కూడా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాకి కూడా ఆయన కథను అందించడం విశేషం. ఆ తరహా లోనే ఆయన రాజమౌళితో చేసిన ప్రతి సినిమాకి కథను ఇవ్వడమే కాకుండా రాజమౌళి ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంలో ఈయన అందించిన కథలు కీలక పాత్రను వహించాయి.
విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేసిన కొన్ని సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఆయన డైరెక్షన్ చేయకుండా రైటర్ గా మాత్రమే ముందుకు సాగుతున్నాడు.ఈయన ‘ రాజన్న ‘ సినిమాని చాలా బాగా తీశాడు. అయితే ఈ సినిమాను చూసిన రాజమౌళి మీరు తీసిన మొదటి సినిమా కంటే ఈ సినిమాలో డైరెక్షన్ చాలా బాగా చేశారు అని అప్రిసియేట్ చేశారట. ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరోసారి ‘శ్రీవల్లి'అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చినప్పటికీ ఈ సినిమా ప్లాప్ అయింది. ఇక ఈ సినిమాని చూసిన రాజమౌళి డైరెక్షన్ చాలా చెత్తగా ఉందనీ.. డైరెక్షన్ కి దూరంగా ఉండాలని మొహం మీదే చెప్పేశారట. అప్పటినుంచి విజయేంద్రప్రసాద్ డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారట.
ఆయన అభిప్రాయం అయనది నేను మాత్రం మరో సినిమాతో హిట్ కొడతా అంటున్నారు విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం మహేశ్, రాజమౌళి మూవీకి కథను అందిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కొడుకు రాజమౌళి గురించి విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూనే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com