Divya Bharathi : శ్రీలంకలో సెగలు పుట్టిస్తున్న దివ్యభారతి

Divya Bharathi : శ్రీలంకలో సెగలు పుట్టిస్తున్న దివ్యభారతి

నటిగా, మోడల్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ దివ్యభారతి. జి.వీ ప్రకాష్ హీరోగా వచ్చిన బ్యాచిలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అందులో తన అందం, నటనతో సినీ అభిమానులను ఆకట్టుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన దివ్య.. మొదటి సినిమాలోనే తన రొమాన్స్ తో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే.. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

తన లేటెస్ట్ ఫొటో షూట్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. రీసెంట్ గా దివ్య భారతి శ్రీలంకకు వెళ్లింది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కి జోడిగా G.O.A.T గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే చిత్రంలో దివ్య నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఇదొక కామెడీ రొమాంటిక్ మూవీ. ఈ సినిమా సక్సెస్ అయితే దివ్య భారతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం. ఈ వయ్యారికి ఇష్టమైన హీరో రజినీకాంత్, ఇష్టమైన మూవీ శివాజీ ది బాస్, ఇష్టమైన హీరోయిన్ నయనతార, డ్యాన్స్ చేయడం కూడా చాల ఇష్టం.

Tags

Next Story