Premalu Heroine Name : ప్రేమలు హీరోయిన్ అసలు పేరేంటో తెలుసా..?

Premalu Heroine Name : ప్రేమలు హీరోయిన్ అసలు పేరేంటో తెలుసా..?

మమితా బైజు.. ఇప్పుడు యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న కుర్ర భామ. మలయాళంలో ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మమితా బైజు ప్రస్తుతం సౌత్ అంతా కూడా ట్రెండింగ్ లో ఉంది. ప్రేమలు సినిమాలో ఆమె చేసిన క్యూట్ యాక్టింగ్ కు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ప్రేమలు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజు ఇదివరకు సినిమాలను చూస్తున్నారు.

ఆమె నటించిన ప్రణయ విలాసం సినిమా లేటెస్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. మమితా బైజు ప్రేమలు సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేరులో ఉన్న ట్విస్ట్ చెప్పి షాక్ ఇచ్చింది. మమితాకు వాళ్ల పేరెంట్స్ నమితా అని పెట్టాలని అనుకున్నారట. కానీ హాస్పిటల్ లో బర్త్ సర్టిఫికెట్ టైం లో ఎన్ బదులుగా ఎం రాయడంతో నమిత కాస్త మమితా అయ్యింది.

స్కూల్ లో జాయినింగ్ టైం లో తన పేరు నమిత కాదు మమితా అని గుర్తించారట. సో అలా నమితా కాస్త మమితా అయ్యింది. అయితే మమితా అంటే మలయాళంలో తియ్యని స్వీట్ లాంటి పదార్థం అనే అర్ధం ఉందట. సో అది కూడా బాగానే ఉందని మమితా పేరునే కొనసాగించారట. అలా.. నమిత కాస్తా మమితగా మారి ప్రేమలుతో అందరినీ ప్రేమలో పడేసిందన్నమాట. త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది.

Tags

Read MoreRead Less
Next Story