Ram Charan : క్లీంకారను రామ్ చరణ్ ఏమని పిలుస్తారో తెలుసా?

X
By - Manikanta |15 April 2024 3:46 PM IST
చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్- ఉపాసన ముద్దుల తనయ క్లీంకార గురించి ఆసక్తికరమైన అంశాలు ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటిదే ఇది కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. క్లింకారాను ముద్దుగా ఏమని పిలుస్తారు అనేది చెప్పేసింది. తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉపాసన క్లింకారాను ముద్దుగా కారా అంటూ పిలుస్తామని చెప్పింది.
ఇలా, సింపుల్ గా కారా అని ముందు పిలిచింది రామ్ చరణేనట. కారా కారా.. అంటూ రామ్ చరణ్ తన పాపను ముద్దుగా ఇంట్లో పిలుస్తుంటాడట. అలా పిలవగానే నాన్న వచ్చాడని సిగ్నల్ గా తేరిపార చూస్తుందట.
చరణ్ ఇంటికి రాగానే.. ఎత్తుకో అంటూ క్లీంకార అల్లరి చేస్తుందని ఉపాసన ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. క్లీంకార గురించి ఉపాసన చెప్పిన మాటలు.. ఆ వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com