Nivetha Thomas : నివేదా థామస్ భర్త, పిల్లలు ఎవరో తెలుసా?

Nivetha Thomas : నివేదా థామస్ భర్త, పిల్లలు ఎవరో తెలుసా?
X

నివేదా థామస్ కు ( Nivetha Thomas ) పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించింది. నిన్ను కోరి, జై లవకుశ, వకీల్ సాబ్, శాకినీ డాకినీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నివేదా థామస్ ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలను తగ్గించింది. తాజాగా '35 చిన్న కథ కాదు' సినిమాలో నటించింది. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రంలో నివేదా భార్యగా, తల్లిగా కనిపించబోతుంది. అందుకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నివేదా పెళ్లి అయ్యిందని, ఇతడే భర్త అన్నట్లుగా ప్రచారం చేశారట. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నివేదా మాట్లాడుతూ... 'ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫొటోను చూసి చాలా మంది నాకు పెళ్లి అయ్యిందని ప్రచారం చేశారు. ఆ విషయాలను మా అమ్మ నన్ను అడిగింది. నాకు మీరు ఎప్పుడు సంబంధం చూశారు అన్నాను. ఈ సినిమాలో విశ్వదేవ్ కి భార్యగా నివేదా థామస్ నటించింది.అతడిని చూపిస్తూ నాకు పెళ్లి అయ్యింది, ఇతడే నా భర్త, వీళ్లు ఇద్దరు నా పిల్లలు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ సినిమాను రానా సమర్పిస్తున్నాడు. నంద కిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నివేదా నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.





Tags

Next Story