Double Ismart : జూలై 1న డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు.
ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కు చార్ట్ బస్టర్ ఆల్బమ్, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు.
ఫస్ట్ సింగిల్ 'స్టెప్పా మార్' ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైజ్లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన కళ్లు చెదిరే పోస్టర్ ను రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీపై క్యూరియాసిటీ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com