Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్
రాపోగా పాపులరైన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో ముందుకు రానున్నాడు. ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ 'ఇస్మార్ట్ శంకర్'. పూరీ జగన్నాథ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి సీక్వెల్ చేస్తున్నారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'.
డబుల్ ఇస్మార్ట్ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ తో లేట్ అవుతోంది. జూన్ అంటున్నారు కానీ.. ఎన్నికల సీజన్ వల్ల లేటయిన సినిమాలన్నీ అదే టైంకి ఫిక్స్ అయ్యాయి. కాబట్టి.. మరింత లేట్ గా రిలీజయ్యే చాన్సుంది.
జులై లేదా ఆగస్ట్ లో 'డబుల్ ఇస్మార్ట్' థియేట్రికల్ రిలీజ్ అయ్యే చాన్సుంది. 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ చేజిక్కించుకొంది. పూరీ- రామ్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నెట్ ఫ్లిక్స్ దీనికి మంచి రేటు ఇచ్చిందట. 90 శాతం టాకీ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన పాటలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com