Double iSmart : పంద్రాగస్టుకు డబుల్ ఇస్మార్ట్ రెడీ

ఉస్తాద్ రామ్ పోతినేని ( Ram Pothineni ), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా 'డబుల్ ఇస్మార్ట్'తో తిరిగి వస్తున్నారు. ఈ కొత్త వెంచర్ గ్రిప్పింగ్ స్టోరీలైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఎక్సయిట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ని న్యూ లెవల్ కి పెంచుతుందని ప్రామిస్ చేస్తోంది.
సంజయ్ దత్ విలన్ గా చేరడం వలన స్టార్ పవర్ లేయర్ని యాడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాస్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్డట్లు అనౌన్స్ చేశారు, ఇది సినిమా విడుదలకు పెర్ఫెక్ట్ టైం. 50 రోజుల కౌంట్ డౌన్ ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. తన ఊజ్స్ స్వాగ్ అండ్ స్టైల్ తో శంకర్ పాత్రకు ప్రాణం పోశారు రామ్ పోతినేని. రామ్కు జోడిగా కావ్య థాపర్ నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్జడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com