Double Ismart : జులై 1న డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్‌

Double Ismart : జులై 1న డబుల్ ఇస్మార్ట్  ఫస్ట్ సింగిల్‌
X

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ పోతినేని ( Ram Pothineni) నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను జులై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. స్టెప్ మార్ అంటూ సాగే ఈ పాట ప్రోమోను రేపు ఉ.11.02 గంటలకు రిలీజ్ చేస్తామంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వుడి విగ్రహం ముందు రామ్ పోతినేని స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. . ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ని అందించారు. దీంతో ఈ పాట కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్‌గా మాస్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా, కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

Tags

Next Story