Eesha Rebba : బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్లో ఈషా రెబ్బా

Eesha Rebba : బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్లో ఈషా రెబ్బా

ఈషా రెబ్బా వరంగల్ అమ్మాయి.. తెలంగాణ పిల్ల.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్న బ్యూటీ. 2012 నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఈషా పాప గ్లామర్ కూడా అప్పుడప్పుడు ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది.

అప్పుడప్పుడు ఊహించిన విధంగా గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫొటో షూట్స్ లో పాల్గొంటూ ఉంటుంది. రీసెంట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ లో తనదైన శైలిలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె చూపులతోనే ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఇంతకంటే ఘాటైన స్టిల్స్ లలో కూడా కనిపించిన ఈషా పాప ఇప్పుడు మాత్రం మరింత అందంగా కనిపిస్తోందంటున్నారు నెటిజెన్లు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈషా బందిపోటు, దర్శకుడు, బ్రాండ్ బాబు లాంటి సినిమాలు చేసింది.

అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈషా రెబ్బగ్లామరస్ రోల్స్ తో కూడా తనను తాను మరింత కొత్తగా చూపించుకోవాలి అని ఆసక్తి చూపిస్తోంది. కేవలం స్కిన్ షోకు మాత్రమే పరిమితం కాకుండా క్యారెక్టర్ లో బలమైన కంటెంట్ ఉండాలి అనే విధంగా కూడా ఆమె ఆలోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story