Kareena Kapoor : చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో తెలియలేదు : కరీనా కపూర్
![Kareena Kapoor : చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో తెలియలేదు : కరీనా కపూర్ Kareena Kapoor : చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో తెలియలేదు : కరీనా కపూర్](https://www.tv5news.in/h-upload/2024/03/29/1224099-kareena-kapoor.webp)
రిఫ్యూజ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor). అనంతరం ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. లవ్, యాక్షన్, కామెడీ చిత్రాలతో సినీ అభిమానులను మెప్పించింది. రీసెంట్ గా
కరీనా నటించిన ది క్రూ సినిమా రేపు విడుదల కానుంది. ఇందులో ఎయిర్ హోస్టెస్ గా ఆమె నటించింది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.
దీంతో ది క్రూతోనైనా హిట్ కొట్టాలని కరీనా భావిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన బ్యాక్ గ్రౌండ్ తో ఈజీగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సక్సెస్ ల కంటే ఫ్లాప్స్ ఎక్కువ వచ్చాయని చెప్పుకొచ్చింది. తాను ఎదుర్కొన్న ఫ్లాప్స్ మరెవ్వరు కూడా చవి చూసి ఉండరని వ్యాఖ్యానించింది.
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడం.. కథల గురించి పాత్రల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేయడం వల్లే ఫ్లాప్స్ వచ్చినట్లు అభిప్రాయపడింది. వరుస ఫ్లాప్స్ అనంతరం కథల విషయంలో కాస్త జాగ్రత్తలు వహించినట్లు తెలిపింది. పాత్రల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుకోవడంతో కెరీర్ గాడిన పడినట్లు వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com