Esha Gupta : ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేశా : ఈషా గుప్తా

Esha Gupta : ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేశా : ఈషా గుప్తా

ఈషా గుప్తా.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకి పరిచయం అక్కర్లేదు. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. 'జన్నత్ 2' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం రాజ్ త్రీడీ, హమ్ షకల్స్, రుస్తుమ్, టోటల్ ధమాల్ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఇషా.. హాట్ హాట్ పోజులతో నెటిజన్లను అలరిస్తుంటుంది. తాజాగా తన గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఈ బ్యూటీ వెల్లడించింది.

తాను ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేసినట్లు తెలిపింది. ఒకవేళ తాను నటి కాకపోయింటే ఈపాటికే ముగ్గురు పిల్లలకు తల్లిని అయ్యేదానినని చెప్పుకొచ్చింది. పిల్లలంటే తనకు అంత ఇష్టమని వెల్లడించింది. అందుకే హెల్తీగా ఉన్నప్పుడే తన అండాల్ని భద్రపరుచుకున్నానని పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే ఇషా గుప్తా ప్రస్తుతం.. హేరీ ఫేరీ 4, దేశీ మ్యాజిక్, మర్డర్ 4 వంటి మూవీస్ లో నటిస్తోంది.

అయితే ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఇలాగే చేసింది. మృణాల్ ఠాకుర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటానని చెప్పింది. కాగా ఎగ్ ప్రీజింగ్ పై ఇషా గుప్తా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషా గుప్తా.. టాలీవుడ్ లో వీడేవాడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లో నటించి మెప్పిచింది.

స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టింది. ఇకపోతే గతే ఐదేళ్ల నుంచి మాన్యువల్ కంపోస్ అనే యువ పారిశ్రామిక వేత్తతో ఈషా గుప్తా రిలేషన్లో ఉంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ప్రకటనతో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story