Vidhya Vasula Aham Movie : ఆహా ఓటీటీలోకి మరో మసాలా మూవీ 'విద్య వాసుల అహం'
ఆహాలో మరో ఆసక్తికరమైన సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. 'విద్య వాసుల అహం'. ఇందులో కొంచెం మసాలా కూడా వున్నట్టుగా ఈ సినిమా టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. అహంతో కూడిన ప్రేమకధ లోని భావోద్వేగాలను, ఇగోలను చూపించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ప్రీమియర్ కానుంది. ఈ సినిమా కథని కథని టూకీగా చెప్పాలంటే రాహుల్ విజయ్, శివానీలు అసలు పెళ్ళంటే ఇష్టం లేని వారిగా కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవలిసి వస్తుంది. పెళ్లయిన తరువాత ఇద్దరూ ఒకరి అభిప్రాయాలకి, ఇంకొకరు గౌరవించాలి. మాట్లాడుకోవాలి, కానీ కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపధ్యలో కధ జరుగుతుంది.
అలాంటి సమయంలో వీరిద్దరూ ఇగోతో కలిసే ఉంటారా లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారా అనేది తెలియాలంటే ఆహాలో మే 17 వరల్ డిజిటల్ ప్రీమియర్ అయ్యే వరకు వేది చూడాల్సిందే. ఈ సినిమాకి మహేష్ దత్త మొత్తూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలు. మణికాంత్ గెల్లి దర్శకుడు. విద్య వాసుల అహం' (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి) అనే టాగ్ లైన్ లో వస్తున్న ఈ సినిమా అహాలో ఈ నెల 17న విడుదలవుతోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com