DSP Fans : డీఎస్పీ అభిమానులకు కిర్రెక్కించే న్యూస్.. సిటీలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్

హైదరాబాద్ మహానగరంలో తన లైవ్ షో పర్ఫార్మెన్స్ ఉంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రకటించారు. జూలై 14న రాక్ స్టార్ డీఎస్పీ తన సోషల్ మీడియా ఖాతాలో భాగంగా హైదరాబాద్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా .. ఆయన మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ నుంచే ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన చూసిన సంగీత ప్రియుల ఆనందానికి అవదులు లేవు. 25 సంవత్సరాలుగా తాను సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు. అలాంటిది మొదటి సారి హైదరాబాద్లో డీఎస్పీ లైవ్ షో ఉంటుందంటే ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లు సినీ ప్రపంచంలో సంగీత రారాజుగా ఉన్నాడు. తెలుగు, తమిళ్, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించి అందరినికి ఉర్రుతలూగించారు.
ఇప్పుడు లైవ్ షో ద్వారా తన సొంత ప్రజల్ని, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న అభిమానులను అలరించాడానికి సిద్దం అయ్యారు. కళ్లు మిరమిట్లు గొలిపై లైటింగ్, స్టేజ్ సెటప్, లైవ్ కంపోజిషన్లతో అద్యంతం అలరించ విధంగా ఈ వేడుక ఉండబోతోంది. ఇలాంటి ఈవెంట్లు మన ఏఆర్ రెహమాన్ సహా.. ప్రపంచ మ్యుజీషియన్లు అందరూ ఇస్తున్నారు. ఈ సిరీస్ లోనే దేవిశ్రీ కూడా నెక్స్ట్ లెవెల్ లో షో ప్లాన్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com