Pushpa 2 Movie Song : 'పుష్ష' నుంచి ఓ పాట.. మాస్ జాతర అంటున్న ఫ్యాన్స్

Pushpa 2 Movie Song : పుష్ష నుంచి ఓ పాట.. మాస్ జాతర అంటున్న ఫ్యాన్స్

ఈ ఏడాదంతా సినిమా అభిమానులు పుష్ప 2 సునామీలో కొట్టుకుపోవాల్సిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ష 2 నుంచి ఓ గ్లింప్స్ వచ్చింది. అందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా, ఆ గ్లింప్స్ కాస్త సోషల్ మీడియాని షేక్ చేసేసింది. ఇప్పుడు పుష్ష టీమ్ ఫ్యాన్స్‌ని మరింతగా అలరించడానికి సిద్ధమైంది.

పుష్ప సినిమాలోని తొలి పాటని విడుదల చేయడానికి రెడీ అవుతోంది. మే మొదటి వారంలో 'పుష్ష 2' నుంచి ఓ పాట రాబోతోందని సమాచారం. సినిమాలోని తొలి గీతంగా ఓ మాస్ పాట రిలీజ్ చేయబోతున్నారు.

పుష్ప మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అలాగే.. పుష్ప2ను కూడా రెడీ చేశారట. ఈ తొలి పాటలో రూలింగ్ చేయబోతున్న పుష్పరాజ్ లైఫ్ స్టైల్ ను హైలైట్ చేస్తారట. గీతాన్ని చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. టీ సిరీస్ సంస్థ పుష్ష 2 ఆడియో రైట్స్ హక్కుల్ని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఆడియో రైట్స్ రూపంలోనే దాదాపుగా రూ.65 కోట్లు దక్కినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story