Raja Saab Teaser : అదిరిపోయే అప్ డేట్.. త్వరలో రాజాసాబ్ టీజర్

ప్రభాస్, నిధి అగర్వాల్ జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజాసాబ్.. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు న్నాయి. రాజాసాబ్ సినిమాను అప్పుడెప్పుడో సైలెంట్ గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్ తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. తర్వాత అంతా సైలెంట్ అయ్యింది. ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్ తర్వాత అసలు ఏం జరుగుతుందని కూడా అప్డేట్ లేదు. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ తో అంత గప్ చుప్ అయిపోయింది. ఇప్పుడు డార్లింగ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోయాడు. దీంతో షూటింగ్ రీస్టార్ట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ షెడ్యూలులో త్వరలో ప్రభాస్ కూడా పాల్గొ నబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. రాజాసాబ్ కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com