Fahadh Faasil : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫహాద్ ఫాజిల్

తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్(APHD)తో బాధపడుతున్నట్లు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆవేశం’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంతకు ఏంటీ ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. అయితే అనూహ్యంగా తాను 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడు ఫహద్. మరి దీనికి చికిత్స ఉందా అని ప్రశ్నిస్తే.. చిన్నతనంలోనే ఈ వ్యాధి బయట పెడితే క్యూర్ చేయచ్చని, కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని.. ఇక తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని చెప్పుకొచ్చాడు.
తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. ఇందులో ఫాహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com