Family Star OTT : ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రసారం కానుందని టాక్. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు.
గతంలో డైరెక్టర్ పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇదే కావడంతో విడుదలకు ముందే ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. వాటిని రీచ్ అవ్వడంలో మూవీ ఫెయిల్ అయ్యింది
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ పై మృణాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఇందు పాత్రలో కనిపించిన స్టిల్స్ షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఇందుగా కనిపించిన క్షణాలు.. ఇందుగా ఉన్న క్షణాలు.. తెరపై తాను చేసే ప్రతి పాత్ర ఎప్పటికీ తన గుండెల్లో ఉంటుందని.. ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపింది. ప్రతి పాత్రను అక్కడే వదిలేయాలని అనుకోలేదని.. ఇందు పాత్రను చాలా ఆనందించానంటూ ఫ్యామిలీ స్టార్ ఫోటోస్ షేర్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com