Actor Ajith Vijayans : ప్రముఖ నటుడు అజిత్ విజయన్ కన్నుమూత

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అజిత్ విజయన్ కు భార్య ధన్య, ఇద్దరు కుమార్తెలు గాయత్రి, గౌరి ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణం ఆయన అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అజిత్ విజయన్ ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీ అందుకున్నారు. ఎందుకంటే ఈయన బడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఈయన ఎవరో కాదు.. ప్రఖ్యాత కథాకళి కళాకారుడు కళా మండలం కృష్ణన్ నాయర్, మోహినియాట్టం నృత్యకారిణి కళా మండలం కళ్యాణి కుట్టి అమ్మ మనవడు.
ఇక ఈయన తల్లిదండ్రుల విషయానికొస్తే.. దివంగత సికే విజయన్ అలాగే మోహినియాట్టం గురువు కళా విజయన్ ల కుమారుడు. ఇండస్ట్రీ లోకి వచ్చి పలు సినిమాలలో నటించిన ఈయన అటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com