OTT : ఓటీటీలో దూసుకెళ్తున్న ఊరు పేరు భైరవకోన

సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఫిబ్రవరి 16న థియోటర్లలో రిలీజైన ఈ మూవీ.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. ముందస్తు ప్రకటన చేయకుండానే మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చినా ట్రెండింగ్లో కొనసాగుతోంది. స్ట్రీమింగ్కు వచ్చినా.. 24 గంటల్లోనే ప్రైమ్ వీడియోలో ఇండియా ట్రెండింగ్ టాప్కు చేరింది. ఫ్యాంటసీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాను డైరెక్టర్ వీఐ ఆనంద్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. తొలివారంలో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఆ తరువాత కాస్త మందగించాయి. మొత్తంగా ఈ చిత్రానికి సుమారు రూ.27కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఊరు పేరు భైరవకోన సినిమాలో హీరోగా సందీప్ కిషన్, హర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్, వడివుక్కరసి ముఖ్య పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com