Fauji Movie Shooting : సెట్స్ పైకి ఫౌజీ.. షూటింగ్ ఎక్కడంటే?

డార్లింగ్ హీరో ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష కుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ లేకుండా సాగింది. ఇప్పుడు డార్లింగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఫౌజీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మూవీ షూటింగ్ మధురై లోని కారైకుడి లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. దేవిపురం అనే అగ్రహారం బ్యాక్ డ్రాప్ లో ఈ షెడ్యూల్ జరగబోతుందని సమాచారం. దాదాపు 20 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగబోతుందట. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ కలిగి ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు.
'పౌజీ' సినిమా కథ 1940ల కాలం నేపథ్యంలో సాగుతుండగా, ఇందులో అనేక ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. హను రాఘవపూడి తనదైన శైలిలో ప్రేమ కథ, గుండెకు హత్తుకునేలా డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేశభక్తి నేపథ్యంతో పాటు, స్వాతంత్య్రానికి ముందు గడిచే రోజులని కూడా చూపించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి అద్భుతమైన సెట్లు రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు, ఒక అద్భుతమైన అనుభూతి సృష్టించాలని హను ఆలోచనలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com