Janhvi Kapoor : సోషల్ మీడియా అంటే భయం.. ట్విట్టర్ ఖాతా లేదు : జాన్వీకపూర్

అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కు ( Janhvi Kapoor) ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని జాన్వీ టీం స్పష్టం చేసింది. దయచేసి ఈ ఫేక్ అకౌంట్లను ప్రోత్సహించకండి. వాటిని ఫాలో కావొద్దు. వీటిలో పోస్ట్ చేసే సమాచారాన్ని నమ్మొద్దు. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు' అని అప్రమత్తంగా ఉండాలని టీమ్ కోరింది. ఆమె పేరుతో ఎక్స్ ఉన్న నకిలీ ఖాతాల వివరాలను పేర్కొంది. జాన్వీ ఫ్యాన్స్ తో టచ్ ఉండడం కోసం కేవలం ఇన్ స్టానే వాడతారని టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 24 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్స్ లో జాన్వీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అంటే తనకు భయమని తెలిపారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ రెడిటు తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని ఆమె వెల్లడించింది. ఇటీవలే ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com