Fighter Movie : నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఫైటర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hritik Roshan) నటించిన ఫైటర్ సినిమా (Fighter Movie) జనవరి జనవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది. ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, అషుతోశ్ రాణా, గీతా అగర్వాల్, తలాత్ అజీజీ కీ లకపాత్రలు పోషించారు.
అయితే ఫైటర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చాలా మంది ప్రేక్షకులకు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తాము దక్కించుకున్నట్టు తెలిపింది. ఫైటర్ మూవీ మార్చి 21వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్కు రానుందని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రం సడెన్ గానే స్ట్రీమింగ్ కు వస్తుందనే వాదన వినిపిస్తోంది.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'డంకీ' సినిమా గతడి సెంబర్లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్ సర్ ప్రైజ్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఫైటర్ మూవీ కూడా డంకీ ను ఫాలో అవుతుంద నిసమాచారం. ముందుగా పెద్ద ప్రచారం లేకుండా మార్చి 21న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఫైటర్ స్ట్రీమింగ్కు రానుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com