డాన్ 3లో ఫిక్స్ .. రణ్‌వీర్ సింగ్‌తో కియారా రొమాన్స్

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) తెరకెక్కించనున్న 'డాన్ 3' చిత్రంలో కథానాయికగా కియారా అడ్వాణీ నటించనున్నారు. గతంలో ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. వాటి నిజం చేస్తూ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కియారా పేరును ప్రకటించారు. “డాన్ 3 విశ్వంలోకి కియారా అడ్వాణీకి స్వాగతం" అంటూ ఎక్ లో పొస్ట్ పెట్టారు. హీరోగా రణవీర్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ అగ్ర హీరోలు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన 'డాన్', షారుక్ ఖాన్ డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్', 'డాన్2'చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సిరీస్ ను కొనసాగిస్తూ 'డాన్ 3' రానుంది. ఇక డాన్-3 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అదే సమయంలో చిత్రంలోని మిగతా పాత్రలకు సైతం నటీనటుల ఎంపిక కూడా కొనసాగుతుందని తెలుస్తున్నది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మహేశ్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక కియారా. రామ్ చరణ్ 'వినయ విధేయ రామ’ సినిమాలోను నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com