Game Changer : గేమ్ చేంజర్ అప్డేట్

Game Changer : గేమ్ చేంజర్ అప్డేట్
X

రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం చరణ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ సన్నివేశాలతో పవర్ఫుల్ స్టోరీతో సిద్ధమవుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్స్ పై మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అప్ డేట్ ఇచ్చి కూడా చాలా రోజులవుతోంది. దీంతో కనీసం చిన్న అప్ డేట్ ఐనా ఇవ్వండని అభిమానులు మేకర్స్ ని అడుగుతున్నా రు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శంకర్ ఓ కీలక ప్రకటన చేశాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని చెప్పాడు. భారతీయుడు2 రిలీజ్ కాగానే 'గేమ్ ఛేంజర్' ప్రొడక్ష న్ పనులు పూర్తి చేస్తానని అన్నాడు. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పోస్ట్ ప్రొడక్ష స్ పసులు ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. అన్నిపనులు పూర్తయిన తర్వాత రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.

సాధ్యమైనంతవరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తానని శంకర్ వెల్లడించాడు. ప్రస్తుతం భారతీయుడు 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న శంకర్.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షయాన్ని తెలిపాడు. ఈ సినిమా విషయా నికొస్తే.. ఇందులో రామ్ చరణ్ డబల్ యాక్షన్ లో నటిస్తున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

Tags

Next Story