Pushpa 2 : గంగమ్మ జాతర సీన్.. ఎన్ని రోజులు.. ఎన్ని కోట్లో తెలుసా..?

Pushpa 2 : గంగమ్మ జాతర సీన్.. ఎన్ని రోజులు.. ఎన్ని కోట్లో తెలుసా..?

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పుష్ప 2 కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. పుష్ప 2 ప్రకటించినప్పటినుంచీ అమ్మవారి గెటప్ లో ఉండే అల్లు అర్జున్ ఫొటోనే ఫస్ట్ నుంచీ చూపిస్తూ వస్తున్నారు. సెకండ్ పార్ట్ లోఇదే హైలైట్ అవుతుందని టాక్. తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో ఈ సీన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అని చెబుతున్నారు. అందుకే.. అదే ఫైట్ ను టీజర్ లోనూ చూపించి గూస్ బంప్స్ తెప్పించారు మేకర్స్.

తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలను హైదరాబాద్‌లో ని ఓ సెట్లో 30 రోజులకు పైగా షూటింగ్ చేశారట. అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరిగిందని చెబుతున్నారు. ప్రత్యేక మేకప్, లైటింగ్ సెట్స్, భారీసెట్‌ ఇలా ప్రతిదానికి భారీగా నిర్మాతలు ఖర్చు చేశారని తెలుస్తుంది. స్పెషల్ కెమెరాను ముంబైనుంచి తెప్పించారని.. దీని కోసమే రూ.30 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. గంగమ్మ జాతర సీన్ సినిమాలో ఆరు నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో మాస్ మసాలా పీక్స్ లో ఉంటుందని టాక్. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ కే రూ.50కోట్ల వరకు ఖర్చయిందని చెబుతున్నారు.

పుష్ప 2 బడ్జెట్ రూ.250 కోట్లు అని భావిస్తున్నారు. కనీసం రూ.వెయ్యి కోట్లు టార్గెట్. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయని చెబుతున్నారు. పంద్రాగస్ట్ నాడు రిలీజ్ డేట్ కావడంతో.. అదేరోజు ఏ విషయం తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story