Gautam Gambir : టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్?

Gautam Gambir : టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్?
X

టీమిండియాకు హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ ను బీసీసీఐ నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్ర‌స్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో ముగుస్తుంది. అంటే జూన్ చివ‌రి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. దీంతో హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ ఇటీవ‌ల‌ ద‌ర‌ఖాస్తుల్ని ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ‌త సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. మరోసారి కోచ్ పదవికి దరఖాస్తుచేసుకోవడంపై ద్రవిడ్ ఆనాసక్తి కనబర్చినట్లు సమాచారం. దీంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఈ క్రమంలో గంభీర్ ను కోచ్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయమై గంభీర్‌తో బీసీసీఐ ప్రతినిధి ఒకరు చర్చ‌లు జ‌రిపిన‌ట్లు సమాచారం.

ప్రస్తుతం ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు కెప్టెన్ గా కేకేఆర్ ను రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. గంభీర్ మెంటర్ షిప్ లో కేకేఆర్ ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోంది. ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్ గానే కాదు.. ఫస్ట్ ప్లేస్ కూడా సొంతం చేసుకుంది. దీంతో బీసీసీఐ కన్ను అతనిపై పడినట్లు తెలుస్తోంది.

హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 27 వరకు సమయం ఉంది. దీంతో బోర్డే అతన్ని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేస్తుంది. పైగా ఈ పదవి కోసం బోర్డు రూపొందించిన అన్ని ప్రమాణాలనూ గంభీర్ అందుకున్నాడు. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడటం, వయసు 60 ఏళ్లలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే.

ఆ లెక్కన గంభీర్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. అంతేకాదు ఇండియా గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లలోనూ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2012లో, 2014లో కెప్టెన్ గా కేకేఆర్ కు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. దీంతో ఏ రకంగా చూసినా.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ సూటవుతాడన్న భావన బీసీసీఐలో ఉంది.

Tags

Next Story