Samantha : భలే చాన్సులే!.. అరుదైన ఘనత సమంత దక్కే అవకాశం

Samantha : భలే చాన్సులే!.. అరుదైన ఘనత సమంత దక్కే అవకాశం
X

'ఏమాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత ( Samantha ). సినీ పరిశ్రమలోకి వచ్చి 14 ఏళ్లు దాటినా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సాధారణంగా ఎవరైనా హీరో, హీరోయిన్లు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటే మేకర్స్ మర్చిపోయే చాన్స్ ఉంటుంది. కానీ సామ్ విషయంలో అలా కాదు. సమంత మయోసైటిస్ కారణంగా ఏకంగా ఏడాదికి పైగా బ్రేక్ తీసుకుంది. ఇటీవలే షూటింగ్స్ కి తిరిగి హాజరు అవుతోంది. ఇప్పటికే ఒక సినిమాను అధికారికంగా ప్రకటించింది.

తాజాగా సూపర్ స్టార్ విజయ్ మూవీ లో నటించేందుకు ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. విజయ్ 69 సినిమాలో సమంత హీరోయిన్ గా చేయబోతోందిట. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పూర్తి అయిన వెంటనే హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ మూవీ చేయబోతున్నాడు. విజయ్ రాజకీయ ప్రకటన చేసిన నేపథ్యంలో హెచ్ వినోద్ కాంబినేషన్ లో చేసేదే చివరి సినిమా అయ్యే అవకా శాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే విజయ్ చివరి సినిమాలో నటించిన అరుదైన ఘనత సమంత దక్కే అవకాశం ఉంది.

మయోసైటిస్ తో సమంత ఏడాది బ్రేక్ తీసుకున్నా కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు. ఆమె ఓకే అంటే మేకర్స్ క్యూ కట్టే అవకావాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సామ్ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. సూపర్ స్టార్ సినిమాలతో పాటు, మంచి కథలను ఎంపిక చేసుకుని మరీ సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా సమంత ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు చేసి ఆకట్టుకుంది. ఓ బేబీ, యశోద వంటి సినిమాల్లో విభిన్నమైన రోల్స్ చేసింది.

Tags

Next Story