Konidela-Allu Family : కొణిదెల - అల్లు కుటుంబాల మధ్య రాజుకున్న అగ్గి

మెగా ఫ్యామిలీ- అల్లు కుటుంబం మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ తరఫున దాదాపు అందరూ హాజరయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ డుమ్మాపై చర్చ సాగుతోంది.
ఇదే టైంలో.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ).. సోషల్ మీడియాలో బన్నీని అన్‌ఫాలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో అల్లు అర్జున్‌ని ( Allu Arjun ) అన్ ఫాలో చేశారు సాయి తేజ్. అల్లు శిరీష్‌ను మాత్రం ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరోసారి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానుల వార్ మొదలైపోయింది.
బన్నీకి ఇలా కావాల్సిందే, మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పు లేదు అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో అయినంత మాత్రాన మా బన్నీకి ఏం నష్టం లేదంటూ అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు. పిఠాపురంలో ప్రచారానికి వెళ్లకుండా ట్విట్టర్ లో పవన్ కు సపోర్ట్ చేసి ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం చేసినదగ్గరనుంచి రగడ కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com