Comedy : కామెడీ చేయడం అంత ఈజీ కాదు.. హనుమాన్ హీరో

Comedy : కామెడీ చేయడం అంత ఈజీ కాదు.. హనుమాన్  హీరో

నవ్వించడం అంత ఈజీ కాదంటున్నారుహనుమాన్ తో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న తేజా సజ్జా. కామెడీ చేయడం యాక్షన్ చేయడం రెండూ కత్తిమీద సామేనని చెప్పారు. "నవ్వులు పండించడం కష్ట మైన కామెడీ చేసే వాళ్లు ఏడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో బ్రహ్మానందంగారు చేస్తే చూశాం, ఇప్పుడు 'రాజు యాదవ్' మూవీలో గెటప్ శ్రీను కామెడీ చేయబోతున్నారు. ఇది నవ్విస్తూ మనసుని హత్తుకునే చిత్రం. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ప్రోత్సహించాలి" అని 'హనుమాన్' మూవీ ఫేమ్ తేజ సజ్జా అన్నారు.

నటుడు గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రాజు యాదవ్'. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీను, అంకిత ఖరత్ హీరోయిన్గా నటించారు. కె. ప్రశాంత్ రెడ్డి, కాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ని తేజ సబ్జా లాంచ్ చేశారు చేశారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ - "అందరూ 'రాజు యాడవ్' మూవీని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి" అన్నారు. "వాస్తవ కథతో సహజసిద్ధంగా ఈ సినిమాని తీశాం. భావోద్వేగాలు, వినోదం ఆకట్టుకుంటాయి" అన్నాడు కృష్ణమాచారి. "మా సినిమాని ఆదరించి యూనిట్ని సపోర్ట్ చేయాలి" అన్నారు హీరోయిన్.

Tags

Read MoreRead Less
Next Story