Hanuman OTT : హను-మాన్ మూవీ.. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

సంక్రాంతి సందర్భంగా రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ (Hanuman). ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాగానే తెరకెక్కింది. కానీ.. విడుదలయ్యాక పెద్ద సినిమాలకు కూడా పోటీ ఇచ్చి ముందు వరుసలో నిలిచింది. అయితే.. ఈ మూవీతో పాటు థియేటర్లలో విడుదలైన అన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. కానీ.. హనుమాన్ సినిమా మాత్రం వెంటనే ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఓటీటీ రిలీజ్‌పై కొంత సస్పెన్స్ కొనసాగింది. అయితే.. చివరకు హనుమాన్ మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది.
మార్చి 16వ తేదీ నుంచి జియో సినిమా ఓటీటీ వేదికగా రాత్రి 8 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. దాంతో.. నార్త్ ఇండియన్స్ ఈ వీకెండ్‌లో హనుమాన్ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కొందరు ఇప్పటికే ఈ మూవీని ఇప్పటికే చూసేయగా.. ఇంకొదరు సండే చూసేందుకు రెడీ అవుతున్నారు. తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ సీన్ సూపర్ అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఆయా సన్నివేశాల క్లిప్పింగ్స్‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు.
జియోతో పాటు మరో ఓటీటీ జీ5లో కూడా హనుమాన్ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేశారు. అంతా ఓకే కానీ చివర్లో జీ5 ఓటీటీ ఒక మెలిక పెట్టింది. ఫ్రీగా స్ట్రీమింగ్ చేసుకోవడం కుదరదని చెప్పేసింది. తెలుగు వెర్షన్‌లో ఈ సినిమా చూడాలంటూ కొంత డబ్బు పెట్టక తప్పని పరిస్థితి. ఇంకొద్ది రోజుల తర్వాత ఈ సినిమాను తెలుగులో ఫ్రీగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఫ్రీగా తెలుగులో చూడాలంటే మాత్రం ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com