Hanuman Update : మార్చి 16న టీవీల్లోకి ‘హనుమాన్’

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన 'హనుమాన్' (Hanuman) సినిమా టీవీల్లోకి రానుంది. మార్చి 16న రా.8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాలో ఈ మూవీ హిందీ వర్షన్ ను విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా.. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని టీవీల్లో రిలీజ్ చేస్తుండటం గమనార్హం. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్‌తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిం రూ.330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. భారీ వసూళ్లతో 90 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సంక్రాంతి సినిమాగా నిలిచింది హనుమాన్. ఇప్పుడీ సినిమా ఓటీటీలో చూడాలంటే వెంటనే జీ5 ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com