Kalki 2 : కల్కి 2 లో ఆయనదే ఇంపార్టెంట్ రోల్

Kalki 2 : కల్కి 2 లో ఆయనదే ఇంపార్టెంట్ రోల్
X

ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తె రకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియన్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీంగా ఆకట్టుకు న్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడి గా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీనికి సీక్వెల్ గా కల్కి -2 మూవీ రాబోతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశ ఉంది. రెండో పార్ట్ కమల్ హాసన్ కీ రోల్ పోషిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధా న్యం ఉంటుందన్నారు. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వీళ్లే ఆ సినిమాకు మెయిన్ అని పేర్కొన్నారు. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. కొత్త వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్లో కొత్త వాళ్లను తీసుకొనే చాన్స్ లేక పోలేదని చెప్పారు.

Tags

Next Story