Game Changer : భారీ ధరకు ‘గేమ్ ఛేంజర్’ నార్త్ రైట్స్

Game Changer : భారీ ధరకు ‘గేమ్ ఛేంజర్’ నార్త్ రైట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ రూ.75 కోట్లకు నార్త్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

నవీన్ చంద్ర, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మూవీని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే పుష్ప, దేవర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వందల కోట్లు పెట్టి భారీ బ్యానర్స్ సొంతం చేసుకున్నాయని టాక్ నడుస్తోంది.

పాన్ ఇండియా రేంజ్ లో అది కూడా నార్త్ లో చరణ్ కు ఉన్న మార్కెట్ ఏ రేంజ్ లో ఉన్నది అనేది.. ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చూస్తూనే తెలుస్తోంది. కేవలం ఒక పోస్టర్ మాత్రమే ఈ సినిమ నుంచి రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు టీజర్ కూడా రిలీజ్ కాలేదు.. ఇంకా టీజర్ కూడా రిలీజ్ అవ్వకముందే ఇలాంటి రికార్డ్ ను ఏ హీరో అందుకోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story