Actress Hema : ఇప్పుడేం మాట్లాడను.. ఏం చేసుకుంటారో చేసుకోండి: హేమ

బెంగళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్‌గా రావడంపై నటి హేమను మీడియా సంప్రదించగా ఆమె దురుసుగా సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడేం మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నారు. మరోవైపు మొదట్లో తాను పార్టీకి వెళ్లలేదని చెబుతూ ఓ వీడియో విడుదల చేసిన హేమ.. నిన్న ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను రిలీజ్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com