Vennera Aadai Nirmala : హీరో తాగొచ్చి రేప్ అటెప్ట్ చేశాడు.. వెన్నెరాడై నిర్మల సంచలనం

Vennera Aadai Nirmala : హీరో తాగొచ్చి రేప్ అటెప్ట్ చేశాడు.. వెన్నెరాడై నిర్మల సంచలనం

హీరోయిన్ గా నాలుగు వందలకుపైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది తమిళ నటి వెన్నెరాడై నిర్మల. వెన్నెరాడై సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తెలుగులోనే ప్రతి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించింది. ఇంటి వెలుగు, దత్తపుత్రుడు, పిచ్చి పిల్ల, బొమ్మ బొలుసు, మదర్ ఇండియా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా ఇలా ఎన్నో టాలీవుడ్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

రీసెంట్ గా బాలయ్య మూవీస్ లో కనిపించింది నిర్మల. గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ పై ఆమె అందులో హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని ఏళ్ళ క్రితం తెలుగులో నటిస్తుండగా చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చిందన్నారు. ఆ సినిమా నుంచి కూడా తాను తప్పుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాత్రి వేళ సినిమా షూటింగ్ కావడంతో తాను తన రూమ్ లో నిద్రపోతున్నానని.. మూవీ హీరో వచ్చి తలుపు కొట్టి మరీ తలుపు తీయండి అని అరిచారని తెలిపింది. ఏం చేయనని.. దగ్గరకు వచ్చి వెళ్లిపోతా అన్నాడని తెలిపింది.తాగి వచ్చి ఆయన అలా మాట్లాడుతుంటే తనకు భయమేసిందని.. ఆ ఘటనతో ఎంతో ఆశ్చర్యపోయా అంటూ వివరించింది. తాను తప్పుకోవడంతో దర్శక నిర్మాతలు తనను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని.. తాను ఒప్పుకోలేదని తెలిపింది. తనకంటే 13 ఏళ్ల చిన్నవాడైన తెలుగు హీరో అలా చేయడం ఊహిచలేదని చెప్పి అందరికీ షాకిచ్చారు వెన్నెరాడై నిర్మల.

Tags

Next Story