Heena Khan : ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నా.. సారీ చెప్పిన హీనా ఖాన్

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి తన గుండెని ఎంతగానో కలి చివేసిందని ప్రముఖ నటి హీనా ఖాన్ పేర్కొంది. స్వయంగా కశ్మీర్ కు చెందిన ఆమె, ఈ ఘటనను 'ఒక చీకటి రోజు'గా అభివర్ణించింది. ఈ భయంకర ఘటనను ఖండిస్తూ.. భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు తెలిపింది. 'ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయి. వారికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. 'ఇది మానవత్వానికి మచ్చ కలిగించిన రోజు. తమను తాము ముస్లింలుగా చెప్పి.. ఎదుటి వారిపై కరుణ చూపకుండా కాల్పులు జరిపిన విధానం భయంకరమైనది. దీన్ని ఖండిస్తున్నాను. అలాగే ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను. ఇండియాలో ఉన్న హిందువులందరికీ, నా తోటి భారతీయలకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబసభ్యుల కోసం ప్రార్థిస్తున్నాను. కశ్మీర్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయా యి. యువ కశ్మీరీల హృదయాల్లో భారతదేశంపై విశ్వాసం ఉప్పొంగుతోంది. ప్రజలంతా ఐకమత్యంతో ఉంటున్నారు. ఇది భారత్ కు ఎంతో క్లిష్ట సమయం అందరం కలిసి మన దేశానికి మద్దతివ్వాలి. ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు. మతాలు, కులాల కంటే ముందు మనమం దరం భారతీయులం' అని గుర్తు చేసింది. ప్రస్తుతం హీనా ఖాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజ న్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 'అందరూ మీలా ఆలోచిస్తే దేశంలో ఎలాంటి అల్లర్లు ఉండవు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com