Nidhhi Agerwal : నేను దెయ్యాన్ని కాదు : నిధి అగ ర్వాల్

హరర్ సినిమాలకు ఉన్న క్రేజీ వేరు. చాలా మంది టాప్ హీరోయిన్లు దెయ్యం పాత్రలో నటించడం కాదు ఏకంగా జీవించేశారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు. 'చంద్రముఖి' తర్వాత ట్రెండ్ మారిపోయింది. జ్యోతిక తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. దీంతో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి ఛాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పేస్తున్నారు. నయనతార, తమన్నా సహా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దెయ్యాల పాత్రల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రాజా సాబ్'లో ప్రభాస్ సైతం దెయ్యంగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ సైతం దెయ్యం పాత్రలో నటిస్తోందనే టాక్ వచ్చింది. దీనిపై నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. తాను 'రాజా సాబ్ 'లో చేస్తున్నది దెయ్యం క్యారెక్టర్ కాదని చెప్పింది. వినోదాత్మకం గా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్య పరుస్తుందంటోంది. అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి.. ఇందులో పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉందంటోంది. ఇంతకూ నిధి ఊరిస్తున్న ఈ పాత్ర ఎలా ఉండబోతోందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com