Sonakshi Sinha : నేను ప్రెగ్నెంట్ కాదు : సోనాక్షి సిన్హా

Sonakshi Sinha : నేను ప్రెగ్నెంట్ కాదు : సోనాక్షి సిన్హా
X

సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha ) - జహీర్ ఇక్బాల్ జూన్ 23న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వదంతులపై ఆమె స్పందించింది. తాను హాస్పిటల్ కు వెళ్తే చాలు ప్రెగ్నెంట్ అనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటోంది సోనాక్షి. తన చిత్ర ప్రమోషన్లోభాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను. జీవితం ఇంతకంటే అందంగా, గొప్పగా ఉండదేమో అనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. మళ్లీ నా సినిమాల చిత్రీకరణ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇకపై మేము హాస్పిటల్కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు. ఇదొక్కటే ఆలోచనలో ఉంటున్నారు' అనిచెప్పారు. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా దవాఖానలో వైద్యంచేయించుకున్నారు. ఆయన్నిపరామర్శించడం కోసం సోనాక్షి అక్కడకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమెపై ఈ రూమర్స్ స్టార్టయ్యాయి. తన పెళ్లిపై వచ్చిన ట్రోలింగ్ను కూడా సోనాక్షి తిప్పికొట్టారు. 'ప్రేమే పెద్ద మతం' అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

Tags

Next Story