Anushka Shetty : అమ్మ మాట విని షాకయ్యా : అనుష్క

Anushka Shetty : అమ్మ మాట విని షాకయ్యా : అనుష్క
X

సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు అనుష్క శెట్టి. 'సూపర్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లోని స్టార్ హీరోలతో కలిసి నటించింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జోడీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సైతం ఉంది. వీరిద్దరి కాంబో అంటే సూపర్ హిట్ కావాల్సిందే. అయితే ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా చిత్రంలో స్వీటీ హీరోయిన్ గా నటించింది. ఇందులో అనుష్క డ్రెస్సింగ్, గ్లామర్ లుక్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాకయ్యానని చెప్పుకొచ్చింది అనుష్క. 'నేను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని మా అమ్మ అనుకుంటుంది.. అలాంటి ఆమె బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్ గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్ ఆ డ్రెస్సులేంటీ అని అన్నది. దీంతో నేను ఎంతో షాకయ్యాను' అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించేసింది అనుష్క. ప్రస్తుతం ఈబ్యూటీ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ చిత్రంలో నటిస్తోంది. 'వేదం' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి.

Tags

Next Story