Samantha : ఊ అంటావా లాంటి సాంగ్ ఇంకోసారి చేయను : సమంత

Samantha : ఊ అంటావా లాంటి సాంగ్ ఇంకోసారి చేయను :  సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్ని నెలల క్రితం మయో సైటిస్ వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఖుషి తరువాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇప్పుడు మూవీల్లో తిరిగి నటిచేందుకు రెడీ అయింది. అయితే తాజాగా ఓ ఈవెంట్ లో ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పుష్ప సినిమాలో ఊ అంటావా పాట.. ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒకటేనంటూ వ్యాఖ్యానించింది. ఆ సాంగ్ చేసే సమయంలో తాను వణికి పోయినట్లు వెల్లడించింది. తానెప్పుడు అందంగా లేనని.. సాధారణమైన అమ్మాయిల్లా కనిపించాలనే ఆలోచనలతోనే ఉంటానని చెప్పుకొచ్చింది.

సెక్సీ అనే పదం తనకు అస్సలు సరిపడదని తెలిపింది. కానీ అలాంటి అసౌకర్యమైన, కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటూనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నట్లు పేర్కొంది. ఊ అంటావా లాంటి సాంగ్ ఇంకోసారి చేయనని.. అందులోని లిరిక్స్ తనకొక ఛాలెంజ్ లాంటివని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story