Kulvinder Kaur : నా తల్లి గౌరవం కోసం వేల ఉద్యోగాలైనా వదులుకుంటా: కౌర్

తనకు ఉద్యోగం పోతుందనే భయం లేదని కంగనాపై చేయి చేసుకున్న CISF మాజీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అన్నారు. తన తల్లి గౌరవం కోసం ఇలాంటి వేల ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి సిద్ధమని తెలిపారు. కంగనాను చెంపదెబ్బ కొట్టినందుకు అధికారులు ఆమెను జాబ్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు జాబ్ ఇస్తామంటూ పలువురు ముందుకొస్తున్నారు. డ్యూటీలో ఉండగా ఆమె అలా చేయడం సరైంది కాదని మరికొందరు అంటున్నారు.
బాలీవుడ్ నటి, నూతన ఎంపీ కంగనా రనౌత్‌ను ఎయిర్‌పోర్టులో చెంప దెబ్బ కొట్టిన CISF జవాన్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 323, 341 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు, ఆ రెండు బెయిలబుల్ సెక్షన్లేనని తెలుస్తోంది. అయితే CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com