Celina Jaitly : సారీ చెప్పను.. నచ్చని వాళ్లు తనను అన్ఫాలో చేసుకోండి : సెలీనా జైట్లీ

ఇండియా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టినందుకు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీకి బెదిరింపులు వచ్చాయి. భారత్ ని పొగిడితే అన్ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే జైట్లీని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీనిపై తాజాగా ఆమె స్పందిం చింది. తాను ఉగ్రవాదానికిఎప్పుడూ వ్యతి రేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్ఫాలో చేసుకోవచ్చని చెప్పింది. 'నా దేశం(భారత్) గురించి మా ట్లాడితే అన్ ఫాలో చేస్తామని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారందరిని నా నేను ఒకటే చెబుతున్నా.. నా దేశం కోసం స్టాండ్ తీసుకున్నందుకు నేను ఎప్ప టికీ, ఎవ్వరికీ సారీ చెప్పను. ఉగ్రవాదం పేరుతో అమా యకులను చంపుతుంటే స్పం దిం చ కుం డా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహిం చే వారివైపు నేను ఉండను. భారత్పై నాకున్న ప్రేమ మి మ్మల్ని బాధపెడితే నన్ను అన్ఫాలో చేయండి. నేను శాంతి, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్ ను గమనిస్తు న్నాను. ఇలాంటి వారిని క్ష మించను. జైహింద్'అని ఇన్స్టాలో రాసుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com