Taapsee Pannu : ఆలోచన మారితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తా : తాప్సీ

Taapsee Pannu : ఆలోచన మారితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తా : తాప్సీ

బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ పన్ను (Taapsee Pannu) ఇటీవలే పెళ్లి చేసుకుంది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగు ప్రచారకర్తగా వ్యవహరించిన టైంలో డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడడం.. చాలా ఏళ్ల పాటు వాళ్ల రిలేషన్షిప్ కొనసాగడం తెలిసిన విషయమే. వీళ్లిద్దరూ గత నెల 23న ఉదయ్పూర్ లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పెళ్లికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. నిజంగా పెళ్లయిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు తాప్సీనే స్వయంగా మథియాస్ తో తన పెళ్లి జరిగిన విషయాన్ని ధ్రువీకరించింది. కానీ తమ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉద్దేశం తనకు లేదంటోంది.

“మా పెళ్లికి సంబంధించిన విషయాలను అందరితో షేర్ చేసుకోవాలని నాకు లేదు. నా పెళ్లి గురించి అందరూ మాట్లాడుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఈ విషయాన్ని బహిరంగ పర్చదల్చుకోలేదు. మీడియాకు, సోషల్ మీడియాకు నా పెళ్లి గురించి చెప్పాలని అనుకోలేదు. పెళ్లి విషయాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనేమీ అనుకోలేదు. నేను నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకున్నా. వాళ్లకు ముందు నుంచి అంతా తెలుసు. వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతానికి మా పెళ్లి ఫొటోలు, వీడియోలు అందరికీ చూపించే ఉద్దేశం లేదు. ఫ్యూచర్ లో నా ఆలోచన మారితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తా” అని తాప్సీ కామెంట్ పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story