Rukmini Vasanth : నటి కాకపోయింటే టీచర్ అయ్యేదాన్ని : రుక్మిణి వసంత్

Rukmini Vasanth : నటి కాకపోయింటే టీచర్ అయ్యేదాన్ని :  రుక్మిణి వసంత్
X

బీర్బల్ త్రైలోజి జి కేస్ 1.. ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్ ( Rukmini Vasanth). అందులో తన అందం, నటనతో ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. గతేడాది కన్నడ సినిమాలైన సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ, బాణదరియల్లి, సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బిలో నటించి మెప్పించింది. ఇందులో సప్త సాగరదాచే ఎల్లో సినిమా.. సప్త సాగరాలు దాటి టైటిల్ తో టాలీవుడ్ లో విడుదలైంది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఆ సినిమాకు ఇక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో.. టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఇక పోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తాను నటి కాకపోయింటే టీచర్ అయ్యేదానినని చెప్పుకొచ్చింది. కేజీఎఫ్, కాంతారావు, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు.. దక్షిణాది సినిమాల వైపు అందరి దృష్టిని మళ్లించాయని చెప్పింది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు, మన చిత్రాలకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్టుల్లో ఈ అమ్మడు నటిస్తోంది.

Tags

Next Story