Ilayaraja Biopic : ఇళయరాజా బయోపిక్ షూటింగ్ స్టార్ట్

మ్యూజిక్ మాస్ట్రో ‘ఇళయరాజా’ (Ilayaraja) బయోపిక్ షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hasan) హాజరయ్యారు. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్, శింబు తదితరులు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. టైటిల్ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. ఈ పోస్టర్ లో చెన్నై రోడ్ల మీద ఇళయరాజా హార్మోనియం పెట్టె పట్టుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మూవీ టీమ్ విడుదల చేసిన ఇంట్రడక్షన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇంతకు ముందు ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
47 ఏళ్లుగా తన సంగీతంతో సినీ ప్రేక్షకులను, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఇళయరాజా ఇప్పటివరకు సుమారుగా 1400కు పైగా చిత్రాల్లో ఏడు వేలకుపైగా పాటలకు సంగీతం అందించారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాలైన ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com